మండలానికి 183 క్వింటాల జీలగలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలానికి 183 క్వింటాలు జిలగలు మంజూరైనట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, మండల వ్యవసాయ సలహా అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్ లు తెలిపారు, ఈ సందర్భంగా వారు చెన్నూరు -1 రైతు భరోసా కేంద్రంలో మాట్లాడుతూ, మండలంలో 2023 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 18 క్వింటాల జీలగలు వచ్చాయని తెలిపారు, ఇవి,రైతులకు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని, కేజీ జీల గల పూర్తి ధర 79 రూపాయలు ఉండగా వీటిని రైతు వాటా 39 రూపాయల 50 పైసలు, కాగా, రైతులు కు 39 రూపాయల 50 పైసలు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందన్నారు, ఇందులో రామనపల్లెకు 50 కింటాలు, అలాగే చెన్నూరు- 3 కు 12 క్వింటాలు, చెన్నూరు-1కు, 20 క్వింటాలు, అదేవిధంగా ఉప్పర పల్లెకు 20 క్వింటాలు, గుర్రం పాడు కు 50 క్విటాలు, కనపర్తికి 6 క్వింటాలు, శివాల పల్లికి 5 కింటాలు, బయనపల్లెకి 20 కింటాలు ఇవ్వడం జరిగిందన్నారు, దీనికి సంబంధించి రైతులు తమ రైతు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోన్ నెంబర్ తో రైతు భరోసా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకొని తమ ముద్రలు వేసి జిలగలు తీసుకొని వెళ్లవలసిందిగా వారు కోరారు, రైతుల విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు 10 కేజీల చొప్పున జీలగలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చరణ్ కుమార్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.