మండలంలో పదవ తరగతి పరీక్షల్లో 63 శాతం ఉత్తీర్ణత
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : 6 మండలంలో ఐదు జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు, అలాగే మూడు ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 8, పాఠశాలలకు గాను 364 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగ అందులో 195 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 151 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగిందని, ఎంఈఓ స్టెల్లా షర్మిలా రాణి తెలిపారు, శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్ష లకు సంబంధించి వివరాలు తెలియజేస్తూ, చెన్నూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కు సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో ఎస్, అన్వర్ హుస్సేన్ 576/600 మండల టాపర్ గా నిలవగా, అలాగే చెన్నూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జి, లక్ష్మీ జస్మిత రెండవ స్థానంలో 561/600 మార్కులు సాధించారు, అలాగే మండలంలోని రామనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు బి కీర్తన రెడ్డి, మూడవ స్థానంలో 558 మార్కులు సాధించారని ఆమె తెలిపారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో శ్రీ భారతి హై స్కూల్ కు సంబంధించి 12 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 12 మంది 100/ఉత్తీర్ణత సాధించారు, మండల వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హం.