NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జర్నలిస్టులు.. ఫ్రెంట్​లైన్​ వారియర్సే…

1 min read

– వైసీపీ యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, మైదుకూరు : నిరంతరం వార్తలు సేకరిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే జర్నలిస్టులు ఆరోగ్యంగా.. క్షేమంగా ఉండాలని మానవత్వం సేవా సమితి అధ్యక్షుడు, వైసీపీ యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్​ రెడ్డి కోరారు. శనివారం మైదుకూరు జర్నలిస్టులకు అర్బన్​ ఇన్​స్పెక్టర్​ చలపతి చేతుల మీదుగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్న నేపథ్యంలో విధినిర్వహణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలలో అవగాహన కల్పిస్తూ సేవ చేస్తున్న జర్నలిస్టులు కూడా కరోనా వారియర్స్​ అని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పాటు జర్నలిస్టులు కూడా కోవిడ్ పై యుద్ధం చేస్తున్న వారేనని అందువల్ల విధి నిర్వహణలో జర్నలిస్టులకు కు ఉపయోగపడేందుకు మాస్కులు,శానిటైజర్లను మైదుకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ చలపతి ద్వారా అందించామని తెలిపారు.

About Author