ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం
1 min read– యువతలో నైపుణ్యాలను మెరుగుపరచి ఉపాధి బాటలు వేసేలా జగన్ ప్రభుత్వం కృషి…
– రాయచోటి పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ కేంద్ర ప్రారంభంలో ఎంఎల్ఏ శ్రీకాంత్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శనివారం రాయచోటి పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ కేంద్ర ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలో స్కిల్ హబ్ ఏర్పాటు కావడం శుభపరిణామమన్నారు. జూనియర్ సాఫ్ర్ వేర్ దేవేలేపర్ మరియు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈ అవకాశాలును యువత సద్వినియోగం చేసుకుని, నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉపాధి అవకాశాలలో పొంది ఆర్థికంగా, సాంఘికంగా ఎదగాలలన్నారు. ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టి గొప్పదన్నారు. సచివాలయాలలో ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. వైద్య శాఖలో 50 వేల పోస్టులను భర్తీ చేశారన్నారు.పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వరకు అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతోపాటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణను ప్రభుత్వం ఇస్తోందన్నారు.
థ్యాంక్యూ సీఎం సార్…
తమకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇచ్చి తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషి గొప్పదంటూ శిక్షణ పొందుతున్న విద్యార్థులు,యువత ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి లో స్కిల్ హబ్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, సర్పంచుల సంఘ అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, కౌన్సిలర్ సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, స్కిల్ డేవేలెప్ మెంట్ జిల్లా అధికారి హరికృష్ణ, ప్రిన్సిపాల్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.