భక్తిశ్రద్ధలతో ఘనంగా యల్లమ్మ జాతర ఊరేగింపు
1 min read-జాతరను పర్యవేక్షించిన డి.ఎస్.పి మహమ్మద్ షరీఫ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు యల్లమ్మ జాతర ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆదివారం ఘనంగా నిర్వహించారు, పోతులూరి అయ్యా స్వామి ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది, ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి చెన్నూరు లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పోతులూరి అయ్యా స్వామిని ట్రాక్టర్ పై ఊరేగించారు, తప్పెట్లు మధ్య వివిధ రకాల కర్రసాము ల విన్యాసాలు చేసుకుంటూ ఊరేగింపు పార్క్ వీధి నుండి పాత బస్టాండ్ శివాలయం,తాసిల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ మీదుగా ఊరేగింపు కొనసాగింది, జాతరను డి.ఎస్.పి మహమ్మద్ షరీఫ్ పర్యవేక్షించారు. చెన్నూరు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు ,పలువురు సిఐలు. ఎస్ ఐ లు. ఏ ఎస్ ఐ లు. హెడ్ కానిస్టేబుల్స్. సివిల్ పోలీసులు విజిలెన్స్ పోలీసులు బందోబస్తు లో పాల్గొన్నారు, ఊరేగింపులో శాంతి కమిటీ సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కర్రసాము విన్యాసంలో పాల్గొన్నారు, యల్లమ్మ జాతర లో భాగంగా నిర్వాహకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్న కమలాపురం శాసనసభ్యులు పి, రవీంద్ర నాథ్ రెడ్డి, …..ఆదివారం యల్లమ్మ జాతర సందర్భంగా ఆదివారం సాయంత్రం కమలాపురం శాసనసభ్యులు పి, రవీంద్ర నాథ్ రెడ్డి ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్నారు, ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు నిర్వహించి , అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపిటిసిలు ముది రెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి, గొర్ల పుల్లయ్య గారి ఓబుల్ రెడ్డి( బాబు) వైయస్సార్ సిపి నాయకులు ఆకుల ప్రసాద్ బాబు, టిఎన్ ,చంద్రారెడ్డి ,పాలగిరి ఉమా మహేశ్వర్ రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.