నేటి యువతకు అల్లూరి స్ఫూర్తి -డివైఎఫ్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని స్థానిక అశోక్ నగర్ జంక్షన్ లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు 4 జూలై 1898 పాండురంగీలో జన్మించారు.7 మే 1924 కొయ్యూరులో బ్రిటిష్ సైన్యం చేత కాల్చి చంపబడ్డాడని తెలిపారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగించిన భారతీయ విప్లవకారుడు . నేటి ఆంధ్రప్రదేశ్లో జన్మించిన అతను 1882 మద్రాసు అటవీ చట్టానికి ప్రతిస్పందనగా బ్రిటీష్వారిని వ్యతిరేకించడంలో పాల్గొన్నాడు, ఇది అటవీ ఆవాసాలలో ఆదివాసీల స్వేచ్ఛా సంచారాన్ని సమర్థవంతంగా నిరోధించింది మరియు వారి సాంప్రదాయ వ్యవసాయం ‘ పోడు ‘ లేదా ‘అడవి’ సాగు వారి జీవన విధానానికి ముప్పు కలిగిస్తుంది. సహాయ నిరాకరణ ఉద్యమం (1920-1922) నేపథ్యంలో బ్రిటిష్ వలస పాలన పట్ల అసంతృప్తి పెరగడం రాంపా తిరుగుబాటుకు దారితీసింది.(1922-1924) దీనిలో అతను దాని నాయకుడిగా ప్రధాన పాత్ర పోషించాడు. ఆదివాసీలు మరియు ఇతర సానుభూతిపరుల సంయుక్త దళాలను సమీకరించడం ద్వారా, అతను భారతదేశంలోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలలో నిమగ్నమయ్యాడు . అతని వీరోచిత సాహసకృత్యాలకు స్థానిక ప్రజలు అతనికి ” మన్యం వీరుడు ” ( అడవి యొక్క హీరో ) అనే బిరుదును ఇచ్చారు అని తెలిపారు. అల్లూరి స్ఫూర్తితో పోరాడి నేడు భారతదేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగాన్ని , పేదరికాన్ని, ఆర్థిక అసమానతలను సాంఘిక బహిష్కరణలను రూపుమాపడానికి యువత నడుము బిగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పర్యావరణ చట్టంలో మార్పులు, కార్మిక చట్టాలలో మార్పులు, నూతన విద్యా విధానం ఐటీ చట్టంలో మార్పులు తీసుకురావడం ద్వారా కార్మికులకు ప్రజలకు గిరిజనులకు ఉన్న హక్కులన్నింటిని అరిస్తుందని తెలిపారు. ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడం భారత దేశంలో ఉద్యోగాలు కల్పించే పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడం వల్లే నిరుద్యోగం భారీగా పెరిగిందని తెలిపారు. నేటి యువత అల్లూరి స్ఫూర్తితో పోరాడి యూత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాలే ఆయుధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, జిల్లా నాయకులు శంకర్, రంగప్పా న్యూ సిటీ కార్యదర్శి హుస్సేన్ బాషా, నాయకులు అమర్ యోగి తదితరులు పాల్గొన్నారు.