వేసవి శిక్షణా శిబిరం.. నిర్వహించడం గొప్పవిషయం
1 min read– వేసవి బాలబాలికల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ కర్నూలు మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో గత మే 1 నుండి 7 వరకు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖంఢ లోని రెండు ప్రదేశాలలో నిర్వహించిన వేసవి బాలబాలికల శిక్షణా శిబిరము ముగింపు కార్యక్రమం ఈరోజు 8/5/23,సోమవారం ఉ. 10:30 గం. ల నుండి 12:00 గం.ల వరకు శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం కళ్యాణమంటపం,శరీన్ నగర్ లో జరిగిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వ హిందు పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ ఏ ధర్మమైనా చిరకాలం వర్ధిల్లాలి అంటే , చిన్నప్పటి నుండీ మన ధర్మం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో అత్యావశ్యకం అని, నేటి పాఠశాల విద్యలో, మన గృహాలలో మన బాలబాలికలకు మనధర్మం గురించి తెలియజేసే సమయం,అవకాశం అటు తల్లిదండ్రులకూ, ఇటు ఉపాధ్యాయులకు లేదని దానికొరకే ఈ వేసవి సెలవుల్లో ఇలా వారం రోజులపాటు హిందూ బాలబాలికలకు విశ్వ హిందూ పరిషత్ , మాతృశక్తి విభాగం వారు ” వేసవి శిక్షణా శిబిరం ” నిర్వహించడం గొప్పవిషయమని అన్నారు. అలాగే ఈ వారం రోజులు నేర్చుకున్న విషయాలను పిల్లలందరూ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని తద్వారా మీ మీ జీవితాల్లో వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు.కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ. మద్దిలేటి మాట్లాడుతూ పిల్లలందరూ చాలా చక్కగా తాము నేర్చుకున్న విషయాలను చక్కగా ప్రదర్శించారనీ దేశభక్తి గీతం, వర్గగీత్,కోలాటాలు,తెలుగు పద్యాలు,రాముడు,కృష్ణుడు, లక్ష్మీ శ్లోకాలను చాలా చక్కగా వల్లెవేశారని కొనియాడారు.మాతృశక్తి జిల్లా కన్వీనర్ శ్రీమతి రాధిక మాట్లాడుతూ గత వారం రోజులుగా నగరమాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి గారు సమయాన్నిచ్చి పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని కొనియాడారు వచ్చేసంవత్సరం కర్నూలు నగరంలో ఇంకా 5 ప్రదేశాలలో బాలబాలికల వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని తెలియజేశారు. మొత్తం కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ , జిల్లా బజరంగ్ దళ్ సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్ ,నగర కార్యదర్శి ఈపూరి నాగరాజు, ప్రవీణ్ ,రాజేశ్వరి ,సహస్ర ,పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.