PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రారంభమైన శాఖా గ్రంధాలయ వేసవి విజ్ఞాన శిబిరం   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   పత్తికొండ శాఖ గ్రంధాలయంలో సోమవారం వేసవి విజ్ఞాన శిభిరం ప్రారంభమైంది. గ్రంథాలయ అధికారి ఎస్ రాంకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ సరస్వతి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేసవి విజ్ఞాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరము పుస్తక ప్రదర్శన చేస్తూ, నాగరత్నమ్మ మాట్లాడుతూ, ఈ వేసవి సెలవుల్లో విద్యార్థిని విద్యార్థుల గ్రంధాలయమునకు వచ్చి పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం పొందాలని  తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన మండల విద్యాధికారి మస్తాన్  పాల్గొని ప్రతి స్కూల్ విద్యార్థులు గ్రంధాలయమునకు వచ్చేటట్లు ఆదేశాలు ఇస్తామని అన్నారు.శాఖా గ్రంధాలయ అధికారి రామ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ వేసవి విజ్ఞాన శిబిరం ఈనెల ఎనిమిదో తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు నిర్వహిస్తామని, ప్రతిరోజు 8 గంటల నుండి 12 గంటల వరకు విద్యార్థిని విద్యార్థులకు కథలు చదివించడం, డ్రాయింగ్ నిర్వహించి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జూన్ 11వ తేదీన పార్టిసిపేట్ సర్టిఫికెట్స్, బహుమతులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్ వెంకటేశ్వర యాదవ్, రిటైర్డ్ టీచర్ మాబుసాహెబ్ రచయిత సవప్ప గారి ఈరన్న తదితరులు పాల్గొన్నారు. 

About Author