స్పందనలో 283 అర్జీలు స్వీకరణ..
1 min read– ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రైతు భరోసా కేంద్రాల ద్వారా మండలాల్లో ఇంకా మిగిలి ఉన్న దాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం గోదావరి సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి, జెడ్పి సిఇఓ రవికుమార్, డిఆర్ డిఏ పిడి విజయరాజు, ఆర్డిఓ కె. పెంచల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, సత్యనారాయణరెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా అధికారులనుద్ధేశించి మాట్లాడుతూ వాతావణ శాఖ సూచనలు మేరకు రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున, ఇంకా మిగిలిన ధాన్యం కొనుగోలు ను మండల తహశీల్దార్లు ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా కొనుగోళ్లలో ముఖ్యమని వీటికి ప్రణాళికయుత ఏర్పాట్లు క్షేత్రస్ధాయిలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు కొనుగోలుపై దృష్టి సారించాలని అన్నారు. ధాన్యం శాంపిల్స్ ను, తేమ శాతాన్ని గుర్తించడానికి సచివాలయ సిబ్బంది నేరుగా పంట పొలాలకు వెళ్లి శాంపిల్స్ శాతాన్ని సేకరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమానికి 283 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.మండవల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన దాకవరపు రాజరత్నం మా గ్రామానికి చెందిన భూమిని చెరువుగా మార్చకుండా తగుచర్యలు తీసుకొని గ్రామాభివృధ్దికి కృషి చేయాలని అర్జీ అందజేశారు. గురుపట్లగూడెం గ్రామానికి చెందిన ఆచంట్ల రామారావు గ్రీన్ ఫీల్డ్ హైవే నిమిత్తం భూ సేకరణ చేసిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు. ఆడమిల్లి గ్రామానికి చెందిన పెంటయ్య అసంపూర్తిగా నిలిచిపోయిన ఆర్ బి కె, సచివాలయాలను పూర్తిచేయాలని అర్జీ అందజేశారు. గురుపట్లగూడెంనకు చెందిన నాగశ్రీహరి గ్రీన్ ఫీల్డ్ హైవే అండర్ పాస్ ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు. స్పందనలో హౌసింగ్, సర్వే సంబంధించిన అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.