రైతులకి ఈ డ్రిప్ మెటీరియల్ ని అందుబాటులో కి తీసుకురావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లాలో జరుగుతున్న ఉద్యాన పథకాల్లో సూక్ష్మ సేద్యానికి సంబంధించి ఈరోజు గుంటూరు నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ శ్రీ వై.వి.ఎస్ ప్రసాద్ నంద్యాలకు విచ్చేసి సూక్ష్మ సేద్య పథకం మీద సమీక్షించారు. అలాగే మహానంది మండలం, తిమ్మాపురం గ్రామంలో ఈరోజు క్షేత్ర పరిశీలన చేయడంతో పాటు నంద్యాల డిఎంఐఓ కార్యాలయంలో ఏ ఏ కంపెనీలు అయితే మెటీరియల్ ఇంకా సప్లై చేయకున్నారో ఆ కంపెనీలందరికి కూడా ఈ నెల 15వ తారీకు లోపల మెటీరియల్ కచ్చితముగా సరఫర చేసి రైతులకు ఇన్స్టాలేషన్ కూడా చేసి రైతులకి ఈ డ్రిప్ మెటీరియల్ ని అందుబాటులో కి తీసుకొని రావాల్సిందిగా ఆదేశించడం జరిగింది అలాగే రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా మొత్తము ఇచ్చినటువంటి టార్గెట్ ని తొందరగా పూర్తి చేయడానికి ప్రణాళిక బద్ధంగా ఆర్బికే వారిగా ప్రాణాలిక తయారు చేసి ఇంప్లిమెంట్ చేయమన్నారు అవసరం ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా డ్రిప్పు మరియు స్ప్రింక్లర్స్ కచ్చితంగా అందజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమంలో పిడి సత్యనారాయణ గారు, ఎంఐ ఇంజనీర్లు,ఎంఐఏఓలు మరియు ఎంఐ కంపెనీ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.