పాఠశాలలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయండి
1 min read– ఎంఈఓ రామకృష్ణుడు.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సోమవారం నాడు మండల రిసోర్స్ భవనంలో ప్రధానోపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు. నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లో, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి మేజర్ మైనర్ రిపేర్లు, విద్యుత్ సౌకర్యo అందుబాటులో ఉండాలని, అలాగే జగనన్న విద్యా కానుక, స్టీలు గ్లాసులు అందజేయాలని ఈ సమావేశంలో తెలిపారు. గడివేముల మండలాని కి 3666 స్టీలు గ్లాసులు,మొదటి విడతలో 12624 పాఠ్యపుస్తకాలు, జగనన్న విద్యా కానుక లో భాగంగా 3743 యూనిఫాం వచ్చినట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఆయా పాఠశాలలకు స్టీలు గ్లాసులు అందజేశారు.సమావేశం అనంతరం ఏ.పి.యం ఎంహెచ్ఓ హుస్సేన్, పంచాయతీరాజ్ ఏఈ భాస్కర్ డి ఈ గంగాధర్ లతో కలిసి మండలానికి వచ్చిన జగనన్న విద్యా కానుక యూనిఫామ్ లను పరిశీలించారు.