ఆపద్బాంధవుడు మోమిన్ మన్సూర్
1 min read– ఆరోగ్య చికిత్సల నిమిత్తం బాలుడికి 10వేల నగదు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఎవరికైనా సరే ఆపద ఉందంటే ఆదుకునే తత్వం ఆయనది.నందికొట్కూరు పట్టణానికి చెందిన ఎస్.వలి కుమారుడు ఎస్.అఫ్జల్ (13) గత కొన్ని సంవత్సరాలుగా ఈ అబ్బాయి మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు.గతంలో రెండు సార్లు ఆపరేషన్లు జరిగాయి. మళ్లీ మూడవసారి అబ్బాయికి ఆపరేషన్ చేయాలని దీనికి ఖర్చు 4 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు.వీరు పేదరిక కుటుంబం కూలీ నాలి పని చేసుకుంటూ వారు జీవనం సాగించేవారు.గతంలో జరిగిన రెండుసార్లు చాలా ఖర్చు అయిందని ఇప్పుడు మళ్లీ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అనడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు మోమిన్ మన్సూర్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. రాష్ట్ర శాప్ ఛైర్మెన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు మోమిన్ మన్సూర్ అబ్బాయి తండ్రికి ఫోన్ పే ద్వారా 10వేల రూపాయల నగదును వారికి పంపించారు.ఆపదలో ఆదుకున్నందుకుగాను వెంటనే తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.