స్పందన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
1 min read– అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధర్ రావు ఐ.పి.ఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో : స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి, ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం చేకుర్చాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు గారు పెర్కొన్నారు.నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చట్ట ప్రకారం పరిష్కారం చూపాలని ఆయా అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత సమయంలోగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీసు అధికారులును ఆదేశించారు. ఎస్పీ గారు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు వారి సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీ గారికి విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో “55 ” మంది ఫిర్యాదిదారులు తమ తమ అభ్యర్థనలను వ్రాత పూర్వకంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలును అడిగి తెలుసుకుని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.’స్పందన’ కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులుపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవలసిందిగ, ఫిర్యాది దారులకు చట్ట పరిధిలో సత్వర న్యాయం అందించవలసిందిగా, తీసుకున్న చర్యల నివేదికను ఎప్పటికప్పుడు పోలీసు ప్రదాన కార్యాలయానికి అందించవలసిందిగా జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు.