కర్నూలులో…హోరెత్తిన ‘యువగళం’
1 min readయాత్రను అడ్డుకునేందుకు వైసిపి లాయర్ల విఫలయత్నం
లోకేష్ ను చూసేందుకు రోడ్ల వెంట బారులు తీరిన జనం
పల్లెవెలుగు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు నగరంలో హోరెత్తింది. యువనేత పాదయాత్రతో నగరంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయి, జనసంద్రంగా మారాయి. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపైకి వచ్చారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను నగరవాసులు లోకేష్ దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కోర్టు భవనం ముందు న్యాయవాదులు లోకేష్ ను కలిసి సంఘీభావం తెలిపారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో న్యాయవాదులు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీ ని జగన్ తరలించారు.హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారు.అమరావతి లోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టు లో వైసిపి ప్రభుత్వం తెలిపింది. విశాఖ లో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు పేర్కొన్నారు. యువనేత లోకేష్ మాట్లాడుతూ… జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ మాది కాదు. కర్నూలులోడ హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.యువనేత కర్నూలు పర్యటనలో వినతులు వెల్లువెత్తాయి. ఎస్సీలు, యాదవులు, వీరశైవులు, బిసిలు, నగర ప్రజలు, ఎలక్ట్రికల్ వర్కర్లు తదితరులు యువనేతను కలిసి సమస్యలు చెప్పుకున్నారు.