దివ్యాంగుడి కష్టం తెలుసుకున్న.. యువనేత
1 min readన్యాయం చేస్తానని హామీ
పల్లెవెలుగు:కర్నూలు 17వవార్డులోని శివాలయం వీధి నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఓ దివ్యాంగుడి ఇంటిలోకి వెళ్లిన యువనేత లోకేష్ అతని కష్టాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దివ్యాంగుడు నరేష్ గౌడ్ తల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ… 35సంవత్సరాలుగా వచ్చే పెన్షన్ ను వైసిపి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే నిష్కారణంగా తొలగించారు.ప్రభుత్వాసుపత్రి రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న మరో కుమారుడి ఉద్యోగాన్ని కూడా అన్యాయంగా తీసేశారు.ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు.మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
నారా లోకేష్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక 6లక్షల పెన్షన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.టిడిపి అధికారంలోకి ఉన్నపుడు దివ్యాంగుల సంక్షేమానికి రూ.6,500 కోట్లు ఖర్చుచేశాం.టిడిపి అధికారంలోకి రాగానే నరేష్ గౌడ్ కు పెన్షన్ అందజేస్తాం.మరో ఏడాది ఓపిక పట్టండి… చంద్రన్న ప్రభుత్వం మీ అందరికీ అండగా నిలుస్తుంది.