NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

22వ హనుమాన్ జయంతి..

1 min read

– పూజల పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి..
– మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికిన ఈవో
పల్లెవెలుగు వెబ్ పెదపాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెదపాడు మండలం అప్పనవీడులోని హనుమాన్ జంక్షన్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నేటి నుండి జరగనున్న 22వ హనుమజ్జయంతి మహోత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి మంగళవారం ప్రారంభించారు. ఆలయ ఈవో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి శాలువా కప్పి పూలమాల అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, పెనుమాల విజయబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పన ప్రసాద్, ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గంటా ప్రసాద్ రావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, తదితర వైసీపీ నాయకులు. మహిళ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు.

About Author