ఎత్తిపోతల పథకం నిర్మించేంతవరకు పోరాడుతాం..
1 min read– కృష్ణ జలాలు ఈ ప్రాంతా రైతుల హక్కు.
– సిపిఐ జిల్లా నాయకులు రమేష్ బాబు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: శ్రీశైలం ప్రాజెక్టు కై సర్వస్వం త్యాగం చేసిన ఈ ప్రాంత రైతులకు కృష్ణా జలాలు హక్కనీ మండ్లెం, తంగడంచ,భాస్కరపురం గ్రామ మెట్ట పొలాలకు ప్రత్యేక లిఫ్టు ద్వారా కృష్ణా జలాలు అందించాలని సాగునీరు అందించేంతవరకు పోరాటం ఆపేది లేదని సిపిఐ జిల్లా నాయకులు ఎం రమేష్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. మంగళవారం 14వ రోజు జలదిక్ష శిబిరం లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14 రోజుల నుండి సాగు నిరుకై రైతులు పోరాటాలు కొనసాగిస్తున్నారని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక లిఫ్టు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఐదువేల ఎకరాలకు కృష్ణా జలాలు అందించాలని వారు డిమాండ్ చేశారు.. అన్ని విధాలుగా త్యాగం చేసిన రైతాంగానికి అన్యాయం చేయడం పాలకులకు తగదన్నారు.. నందికొట్కూరు నియోజకవర్గం లో వేలాది ఎకరాల మెట్ట భూములు బీడు భూములుగా మారాయని పక్కనే నీళ్లు ఉన్నా చూడడానికి తప్ప తాగడానికి లేని పరిస్థితి ఉందన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఈ ప్రాంత పరిస్థితి ఉందన్నారు.. అన్ని ప్రాంతాలకు సాగు, తాగునిరందిస్తున్న ఈ ప్రాంతం అన్యాయానికి గురవుతుందన్నారు. తక్షణమే ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత సాగునీరు అందే విధంగా నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో రైతులు శివ ప్రసాద్, సుధాకర్, రమణ, ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు.