ఆర్పీలకు ‘పథకాల’పై అవగాహన ఉండాలి: మెప్మా పీడీ
1 min readఆదోని మెప్మా ఆర్పీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
పల్లెవెలుగు:పొదుపు సంఘాల గ్రూపు సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే…. ఆర్పీలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రాజెక్టు డైరెక్టర్ నాగశివలీల. మంగళవారం ఆదోని మెప్మా ఆర్పీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ నాగశివలీల మాట్లాడుతూ పొదుపు మహిళలు తీసుకున్న రుణం తిరిగి బ్యాంకర్లకు చెల్లించేలా చూసుకోవాలని, అప్పుడే బ్యాంకర్లు మళ్లీ రుణ సౌకర్యం కల్పిస్తారని వారికి వివరించాలన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, జగనన్న నగర్ మరియు పేదలందరికీ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి… వారికి లబ్ధి చేకూర్చడంలో ఆర్పీలదే కీలకపాత్ర అన్నారు. ఆర్పీలు క్రమ శిక్షణతో పొదుపు మహిళల బుక్ రికార్డు మెయింటెన్ చేయించాలని, ఎప్పుడూ పొదుపు మహిళలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నాగశివలీల వెల్లడించారు. శిక్షణ కార్యక్రమంలో ఏఓ నాగరాజు, ఐబీ మురళీ, ఎల్హెచ్ జిలాని తదితరులు పాల్గొన్నారు.