PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను కలెక్టర్ ఆదేశాల మేరకు భర్తీ చేసినట్లు ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు తెలిపారు, ఈ మేరకు ఆయన బుధవారం ఎంపీడీవో కార్యాలయం నందు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, కొండపేట సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ ల తో కలిసి వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు, ఇందులో రామనపల్లి లో బీసీ మహిళకు, అలాగే చెన్నూరు సచివాలయం-1 పరిధిలో ఎస్టి మహిళకు, కొండపేట ఓసి మహిళకు సంబంధించి నియామక పత్రాలను అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎంపీపీ, ఎంపీడీవో మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్లైన మీరు మీకు కేటాయించిన 50 ఇండ్లకు సంబంధించి ఏ సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు, అంతేకాకుండా ప్రభుత్వ పథకాలను మీకు కేటాయించిన 50 ఇండ్లకు సంబంధించిన సభ్యులకు తెలియజేయాలన్నారు, ఎవరైనా అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందకపోతే వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు వారికి చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పై ఉందని వారు తెలియజేశారు, మీకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని వారు నూతన గ్రామ వాలంటీర్లకు తెలిపారు.

About Author