సీఎం.సహాయనిధి ..10 లక్షలు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పత్తికొండ నియోజకవర్గ పరిధిలో నలుగురు లబ్దిదారులకు 10 లక్షల విలువగల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పంపిణీ చేశారు. జి ఎర్రగుడి గ్రామానికి చెందిన షర్ఫున్ బీకి 6 లక్షల రూపాయలు, కరెంట్ షాక్ తో మూడు సంవత్సర క్రితం మృతి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు సుగాలి రంగడు నాయక్ కి 2 లక్షల రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు.అలాగే వివిధ కారణాలతో మృతి చెందిన సూదేపల్లె లొడ్డ రాజ్ కుమార్ 1లక్ష రూపాయలు, బోగోలు రాజేష్ కు 1 లక్ష రూపాయలు విలువ గల చెక్కులను శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ లబ్ధి దారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని రోగాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందుతుందని అన్నారు.అంతేకాకుండా అనేక రోగాలకు ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. పేదవారి ఆరోగ్యానికి, జీవితాలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలుస్తుదని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరాసా కల్పిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 1000కి పైగా రోగాలను చేర్చడం జరిగిందని, అలాగే మిగతా రోగాలకు సీఎంఆర్ఎఫ్ నుండి సహాయమందించడం జరుగుతుందన్నారు.చెక్ ను అందుకున్న లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.