ముందస్తు ప్రణాళికతో రైతులకు ఎరువులు విత్తనాలు పంపిణీకి సిద్ధం
1 min read– ఏ డి ఏ రాజశేఖర్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు విత్తనాలు పంపిణీ కి రైతు భరోసా కేంద్రాల ద్వారా పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని బుధవారం నాడు మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశమైన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ఆదేశించారు. గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా జూన్ జూలై ఆగస్టులో 200 మెట్రిక్ టన్నుల యూరియా డిఎపి కాంప్లెక్స్ ఎరువులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏం హేమ సుందర్ రెడ్డి రెడ్డికి ఆదేశించారు రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ 50% సబ్సిడీతో పంపిణీ చేస్తామన్నారు కేజీ 70 రూపాయలు పూర్తిస్థాయి ధర ఉండగా సబ్సిడీ పోను 39 రూపాయల 90 పైసలుగా నిర్ణయించినట్లు తెలిపారు రైతు భరోసా కేంద్రాల్లో డిమాండ్ ఉన్న పురుగుమందులు కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అలాగే వైయస్సార్ యంత్ర సేవా పథకంలో భాగంగా రెండో విడత దరఖాస్తు చేసుకున్న రైతులకు సబ్సిడీతో యంత్రాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు మండలంలో ఐదు గ్రామాల రైతులు దరఖాస్తు చేసుకున్నట్టు కోరట మద్ది. గడివేముల టు. ఓండుట్ల. పెసర వాయి. దుర్వేశి. గ్రామాలు దరఖాస్తు చేసుకోగా ఇందులో కోరటమద్ది గ్రామంలో రైతులు ఆసక్తి చూపటం లేదని మండల వ్యవసాయ శాఖ అధికారి తెలుపగా వేరే గ్రామానికి యూనిట్ ను తరలించాలని ఆదేశించారు. దరఖాస్తుకు ఈనెల 12 వ తారీకు ఆఖరి రోజని రైతు సోదరులకు పథకం ఉపయోగాలు తెలియజేసి అమలు అయ్యేలా చూడాలని ఆదేశించారు యూనిట్ కి దాదాపు 15 లక్షల రూపాయల కింద ట్రాక్టరు పనిముట్లు తీసుకునే అవకాశం ఉంటుందని రైతులకు అవగాహన కల్పించాలన్నారు గ్రూపు కన్వీనర్లు. కో కన్వీనర్లు సభ్యులు మరియు మండల వ్యవసాయ శాఖ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.