సీపీఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
1 min readపల్లెవెలుగువెబ్, నందికొట్కూరు : కరోనతో పేదలు ఆరోగ్యంగా.. ఆర్థికంగా క్షితికిపోయారని, వారిని ఆదుకోడానికి దాతలు ముందుకు రావాలని సీపీఐ మండల కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం జూపాడు మండల కేంద్రంతోపాటు సిద్దేశ్వరం గ్రామాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కరోన కర్ఫ్యూ కొనసాగుతున్నందున ఉపాధి లేక పేదలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి పేదవాడికి నెలకు పదివేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలన్నారు. ప్రతి ఒక్క కార్మికునికి, ప్రజలకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణి చేయాలన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా వేయాలన్నారు. జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్‌గా గుర్తించి వారికి నెలసరి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు శ్రీనివాసులు రైతు సంఘం నాయకులు అహమద్,సీపీఐ నాయకులు నరసింహ, గౌతమ్, సాంబ శివుడు, రవి తదితరులు పాల్గొన్నారు.