PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్జీదారుడు సంతోషం, సంతృప్తే అంతిమ లక్ష్యం..

1 min read

– ఫిర్యాదులను సంతృప్తిస్ధాయిలో వేగవంతంగా పరిష్కరించడమే జగనన్నకు చెబుదాం..
– 1902 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదుల స్వీకరణ..
– నూరుశాతం నాణ్యతతో సమస్యలు పరిష్కారం..
– అర్జీల పరిష్కారంలో సంతృప్తిస్ధాయి అందించిన మొదటి మూడు జిల్లాల్లో ఒకటిగా నిలిచిన ఏలూరు..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారంలో వేగవంతమైన నాణ్యమైన పరిష్కారమే ధ్యేయంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, డిఆర్ డిఏ పిడి ఆర్ విజయరాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై . రామకృష్ణ, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, డిఎస్ఓ ఆర్.ఎస్.ఎస్. రాజు, డిపిఓ విజయలక్ష్మి, డిఎల్ డిఓ రమణ, పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ అర్జీల ద్వారా పరిష్కారానికి సాద్యంకాని సమస్యలను జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా 24/7 పనిచేసే 1902 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తెలియపరచవచ్చన్నారు. అంతేకాకుండా తమ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులను తమ సమీపంలోని సచివాలయాల్లోను, సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కూడా అందించవచ్చన్నారు. టోల్ ఫ్రీ నెంబరు నెట్ వర్క్ బిజీ అని వచ్చిన సమయంలో జెకెసి వెబ్ సైట్ లోకి వెళ్లి ఫిర్యాదు దారుని ఫోన్ నెంబరు , సమస్య చెబితే తిరిగి వారికి ఫోన్ కాల్ వచ్చి వివరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరిటనే నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న స్పందన అర్జీల స్వీకరణ కార్యకమాన్ని ప్రతి సోమవారం నిరంతరాయంగా నిర్వహిస్తూ సకాలంలో నాణ్యమైన సంతృప్తి కరమైన పరిష్కారాలను అందివ్వడం జరిగిందన్నారు. ఈ విషయంలో అర్జీదారుని పరిష్కారానికి సంతృప్తి స్ధాయి అందించిన మొదటి మూడు జిల్లాల్లో ఏలూరు జిల్లా ఒకటిగా నిలిచిందన్నారు. ఇదే సేవలను మరింత నాణ్యతతో, నిర్ధిష్ట సమయం ప్రకారం ప్రణాళిక బద్దంగా వేగవంతంగా పరిష్కరించే ప్రధాన ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టు విధానం ద్వారా నాణ్యమైన, సంతృప్తికరమైన , పారదర్శకమైన పరిష్కారం అందుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం కంటే మరింత మెరుగ్గా అర్జీల పరిష్కారం అందుతుందన్నారు. ఇందులో 1902 కాల్స్ స్వీకరణ, ఐవిఆర్ఎస్ ఎస్ఎంఎస్ సందేశంతో మల్టిపుల్, ఫీడ్ బ్యాక్, అప్ డేట్ సమాచారం ఎప్పటికప్పుడు హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూం నుండి అందుతుందన్నారు. ఫోన్ కాల్స్ ద్వారా అందిన ఫిర్యాదులను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ పరిశీలనలో సియంఓ స్ధాయి నుండి నేరుగా సచివాలయాల పరిధిలోని ఆయా శాఖల విభాగాల వరకు సీనియర్ అధికారులన పర్యవేక్షణలో క్షేత్రస్ధాయిలో పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచేందుకు గాను ఇప్పటికే ఏర్పాటు చేసిన జిల్లా స్ధాయి, మండలస్ధాయి ఆడిట్ టీం లు ప్రత్యేకంగా రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మేరకు సమస్యలను పరిష్కరించేందుకు కృషి జరుగుతున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సంబందించి వాటిని పొందడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా వాటిని పొందటంలో అవాంతరాలు ఎదురైనా తమ సమస్యలను జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఫోన్ చేసి తెలియపరచవచ్చన్నారు.
ప్రతిరోజు స్పందన గ్రీవేన్స్ పై సమీక్షా
జిల్లా ప్రతిరోజు ఉదయం 8.45 గంటల నుండి 9.30 గంటల వరకు జిల్లా, మండల స్ధాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన, గ్రీవెన్సెస్ తదితర అంశాలపై సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు. స్పందనలో అంది పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై , వివిధ పత్రికల్లో ప్రచురించబడే ప్రతికూల వార్తాంశాలు, వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి అయా అధికారులతో సమీక్షించి నూరుశాతం నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కార తీరు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం సరైన రీతిలో జరగనట్లు గుర్తిస్తే తొలిగా షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నామని ఇదే క్రమంలో మూడు నోటీసులు జారీ అయితే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. స్పందనలో అందే అర్జీల్లో సివిల్, భూమి సంబంధిత వివాదాలు ఎక్కువగా అందుతున్నాయని వాటిలో ప్రైవేటు భూములకు సంబంధించి ఎక్కువగానే ఉంటున్నాయన్నారు. ఇటువంటి విషయంలో సంబంధిత తహశీల్దారు ఆద్వర్యంలో సర్వే చేయింది అందుకు సంబంధించిన సమాచారాన్ని ఫిర్యాదుదారునికి అందించి జిల్లా న్యాయసేవాధికారి సంస్ధ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ప్రతివారం క్షేత్రస్దాయిలో సంబంధిత అధికారులతో క్షేత్రస్ధాయి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏరోజైతే ఏ ప్రభుత్వ సంస్ధను తనిఖీ చేయాలన్నది సంబంధిత అధికారికి ఆరోజున తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇప్పటికే అంగన్ వాడీ తదితర వ్యవస్ధలు ఒక క్రమపద్దతిలోకి రావడం జరిగిందన్నారు.

About Author