విధ్వంసక పాలనకు సజీవసాక్షి జైన్ పరిశ్రమ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్షసాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచలో నిలచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్ లాల్ జైన్ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. గత ప్రభుత్వంలో ఇందుకోసం 623ఎకరాల భూమి కూడా కేటాయించారు. అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జైన్ ప్రాజెక్టు నిలచిపోయింది. సైకో సిఎం వికృత పాలనకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని సెల్ఫీ ఫోటో దిగారు.