NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీ… వ్యక్తి మృతి

1 min read

– బనగానపల్లె పట్టణ శివారు లోని సాయిబాబా ఆలయం వద్ద బైక్ ప్రమాదం.

– సంఘటన తెలుసుకొన్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి 

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మల్లికార్జున మృతదేహాన్ని సందర్శించి పోస్ట్ మార్టం ని ర్వహించినబంధువులకు అప్పగించాలని డాక్టర్ లకు ఆదేశించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి లింగంబొడు గ్రామం అంటేనే కాటసాని వారి సొంత గ్రామం లాంటిది.అవుకు మండలం లింగంబొడు గ్రామానికి చెందిన మల్లికార్జున (20) అనే యువకుడు నిన్న రాత్రి బనగానపల్లె నుంచి లింగంబొడు గ్రామానికి వెళుతుండగా బనగానపల్లె పట్టణ శివారులోను సాయిబాబా ఆలయం వద్ద గుర్తుతెలియని ట్రాక్టర్ వాహనం ఢీకొనడంతో మల్లికార్జున తో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలుఅయ్యాయి.మెరుగైన వైద్యం కొరకు నంద్యాలకు తరలిస్తుండగా మల్లికార్జున మార్గమధ్యలో మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరికి మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  తమ సొంత వాహనాన్ని నంద్యాలకు పంపించారు. అయితే మార్గమధ్యలో చనిపోయిన మల్లికార్జున మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున మృతదేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాటసాని  పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి  ఆదేశించారు. తమ కాటసాని కుటుంబాలకు లింగం బొడు సొంత గ్రామం లాంటిదని కాబట్టి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజలు తమ వద్దకే వస్తారని గుర్తు చేశారు. మల్లికార్జున చిన్న వయసులో చనిపోవడం తనకు చాలా బాధాకరమైన సంఘటనని ఆ కుటుంబానికి తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని.

About Author