ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి జూపాడు బంగ్లా మండలంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో గురువారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. నందికొట్కూరులో బాలికల డిగ్రీ ఇంటర్ మహిళల కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఐటీఐ మహిళ కళాశాల ఏర్పాటు చేయాలని, అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లకు మెస్ చార్జీలు పెంచాలని లోకేష్ కు విన్నవించుకున్నారు . మండలాలలో జూనియర్ కాలేజీలు లేకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురై విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోల్పోతున్నారని అన్నారు. . రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో మౌలిక వసంతలు కల్పించి కమాటి పోస్టులు , వార్డెన్ పోస్టులు భర్తీ చేసి మెస్ చార్జీలు పెంచాలని కోరారు.