బీసీ లకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ..!
1 min readటీడీపీ అధికారంలోకి రాగానే బీసీల భద్రతకు రక్షణ చట్టం తీసుకోస్తాం..
బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి.
బిసిలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే.
బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలం తంగడంచ క్రాస్ వద్ద బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖీ సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.
రాఘవ :బిసిలకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి రుణాలు అందడం లేదు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదు.
పుల్లయ్య యాదవ్:గొర్రెల పెంపకం కోసం వైసిపి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు.
శ్రీనివాస్: కొత్త జీఓ లు తీసుకొచ్చి
మత్స్యకారులను జగన్ వేధిస్తున్నాడు. 217 జీఓ రద్దు చెయ్యాలి. రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి.
గురుమూర్తి:బీసీ జనగణన జరగాలి. దాని ప్రకారం నిధులు మంజూరు చెయ్యాలి.
విజయ్:బీసీ సంక్షేమ హాస్టళ్ల లో కనీస మౌలిక వసతులు ఉండటం లేదు.
శీనయ్య:జగన్ పాలనలో నాయి బ్రాహ్మణులు అనేక ఇబ్బందులు పడుతున్నాం.
సంజీవ రాయుడు:బిపి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చెయ్యాలి.
రామకృష్ణ :బోయ లను ఎస్టీల్లో చేర్చాలి. బోయలకి కుల వృత్తి లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నాం.
లింగ మూర్తి:జగన్ పాలనలో కల్లు గీత కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు.
రజకులకు జగన్ ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందడం లేదు. మమ్మలని ఎస్సీ ల్లో చేర్చాలని
నందికొట్కూరు బీసీ సామాజిక వర్గం ప్రతినిధులు ముఖాముఖి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
లోకేష్ మాట్లాడుతూ…
గెలవక పోయినా నందికొట్కూరు లో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మెగా సీడ్ పార్క్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు వైసిపి ఆ రెండు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది.టిడిపి హయాంలో ప్రతి నియోజకవర్గం లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాం.జగన్ పాలనలో కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలు పది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.రూ.270 కోట్లు యాదవ సామాజిక వర్గానికి ఖర్చు చేసింది టిడిపి.టిడిపి హయాంలో పాడిపరిశ్రమ ను ప్రోత్సహించాం. మేత,దాణా, మందులు అన్ని సబ్సిడీ లో అందించాం .గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం. గోకులంలు ఏర్పాటు చేశాం. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేసాడు.టిడిపిఅధికారంలోకి వచ్చిన వెంటనే గొర్రెలు, పశువులు కొనడానికి సబ్సిడీ రుణాలు అందిస్తాం. మందులు, దాణా, మేత, ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం.గొర్రెలు పెంపకం కోసం బంజరు భూములు కూడా కేటాయిస్తాం.జీఓ 217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టాడు జగన్. ఎప్పటి నుండో మీకు హక్కున్న చెరువులను వైసిపి నాయకులు లాక్కున్నారు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జిఓ 217 రద్దు చేసి మత్స్యకారులకు చెరువులు అప్పగిస్తాం.టిడిపి హయాంలో వేట విరామ సమయంలో పెన్షన్ ఇచ్చాం. బోటు, వలలు, ఇతర పరికరాలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించాం.బీసీ ఉపకులాల కు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చేందుకే టిడిపి లో సాధికార సమితిలు ఏర్పాటు చేశాం.బిసిలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే.బిసిలకు పుట్టినిల్లు టిడిపి.బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి.10 శాతం రిజర్వేషన్లు కట్ చేసింది జగన్. 16 వేల మంది బిసిలు పదవులు కోల్పోయారు.26 వేల మంది బిసిల పై అక్రమ కేసులు పెట్టారు.కుర్చీ, టేబుల్స్ లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు జగన్.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిల భద్రత కోసం బిసి రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటం కోసం ఆర్ధిక సాయం అందిస్తాం.వైసిపి రద్దు చేసిన రిజర్వేషన్లు టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచుతాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇస్తాం.బీసీ జనగణన జరగాలి అని కేంద్రాన్ని డిమాండ్ చేసింది టిడిపి.టిడిపి హయాంలో నియోజకవర్గానికి ఒక బిసి రెసిడెన్షియల్ కళాశాల ఉండాలి అని పనులు ప్రారంభించాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గంలో బిసి రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం.బీసీ హాస్టళ్లు జగన్ పాలనలో నిర్వీర్యం అయ్యాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.బీసీ విద్యార్థుల చదువు కోసం ఏర్పాటు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం, విదేశీ విద్య పథకం, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు.వైసిపి ప్రభుత్వం రద్దు చేసిన అన్ని బిసి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం.బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేరుస్తామని జగన్ మోసం చేశారు.నాలుగేళ్లు పడుకొని కేవలం ఎన్నికల స్టంట్ కోసం మళ్లీ కొత్త తీర్మానం చేసి కేవలం 4 జిల్లా ల్లో ఉన్న బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేసాడు.టిడిపి హయంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కేంద్రం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చాం. ఇప్పుడు జగన్ మరో సారి తీర్మానం చెయ్యడం బోయ, వాల్మీకిలను మోసం చెయ్యడమే.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బోయలు, వాల్మీకిలు ఏ వృత్తి చేసుకున్నా రుణాలు అందిస్తాం.సొంత లిక్కర్ అమ్ముకోవడానికి జగన్ కల్లు గీత కార్మికులపై కక్ష కట్టాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం. కల్లు గీత కు అవసరమైన పనిముట్లు అందజేస్తాం.మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం.తాటి చెట్ల పెంపకం కోసం ప్రోత్సాహం అందిస్తాం.టిడిపి హయాంలో బిసిలకు ముఖ్యమైన పదవులు ఆర్ధిక శాఖ, టిటిడి, ఏపిఐఐసి, తుడా ఛైర్మెన్ లాంటి ఎన్నో పదవులు ఇచ్చాం.జగన్ పాలనలో ముఖ్యమైన పదవుల్లో ఎవరు ఉన్నారో బిసిలు ఆలోచించాలి.బిసిల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు, రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం.బిసిల తరపున పోరాడిన టిడిపి నేతల పై అక్రమ కేసులు పెట్టారు.నీతి, నిజాయితీ, విలువలతో ఎదిగిన ఆదిరెడ్డి అప్పారావు, వాసులను ఈ ప్రభుత్వం అన్యాయంగా వేధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేదు అని జగన్ ఆదిరెడ్డి కుటుంబాన్ని వేధించింది వైసిపి ప్రభుత్వం.రజకలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నిలబెట్టుకోలేదు.టిడిపి హయాంలో రజకులకఎమ్మెల్సీ ఇచ్చింది టిడిపి, దోబి ఘాట్స్ ఏర్పాటు చేసింది టిడిపి. వాషింగ్ మెషిన్లు ఇచ్చింది టిడిపి.వైసిపి బాధితురాలు అయిన మునిరాజమ్మ కు ఐదు లక్షల రూపాయిలు సాయం చేసింది టిడిపి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రజక సామాజిక వర్గాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.