ద్విచక్ర వాహనం.. 180 లీటర్ల సార స్వాధనం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలంలోని వేములపాడుకు దగ్గర్లో గల సోలార్ ప్లాంట్ వద్ద ఒక ద్విచక్ర వాహనము 180 లీటర్ల సారాయిని పట్టుకోవడం జరిగింది. ద్విచక్ర వాహనము నడుపు వ్యక్తిని అమర్ నాయక్, s/o సుబ్బరాయుడు, రాళ్ల కొత్తూరు విలేజ్ గా గుర్తించడమైనది. నాయకులు సదరు సరుకు గడ్డమేకలపల్లి కి చెందిన పెద్దన్న.సోమన్న,s/o వెంకటన్న కి చెందినదని తెలిపాడు.తదుపరి ఇద్దరిపై కేసు నమోదు చేసి అమర్ నాయక్ ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడమైనది. ఈ విధంగా పెద్ద మొత్తంలో నాటు సారాయి తయారుచేసి తరలించే వారిపై PD act నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.