PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలెన్నుకున్న వ్యక్తిపై నేరస్తుడి పెత్తనమేంటి..?

1 min read

– నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను  బైరెడ్డి అప్రతిష్టపాలు చేయడం దుర్మార్గం..

– స్థానిక ఎమ్మెల్యేని బలహీన పరచడం అధిపత్య పోరులో భాగమే..

–  టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు..

– బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అవినీతి పై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు మీడియా సమావేశం.

– నందికొట్కూరు నియోజకవర్గం యువగళం క్యాంప్ సైట్ నుండి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను  బైరెడ్డిఅప్రతిష్టపాలు  చేయడం దుర్మార్గమని, స్థానిక ఎమ్మెల్యేని బలహీన పరచడం అధిపత్య పోరులో భాగమేనని  ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి పై నెరస్తుడి పెత్తనమేంటని  టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అవినీతి పై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గురువారం నందికొట్కూరు నియోజకవర్గం యువగళం క్యాంప్ సైట్ లో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర బుధవారం నుంచి నందికొట్కూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా  యువకళం కార్యక్రమానికి తరలివస్తున్నారు. ప్రజలు అనేక సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. నందికొట్కూరు ఎస్సి రిజర్వుడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.  ఈ యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  ఎమ్మెల్యే ఆర్థర్ ను పర్యటనలకు పోకుండా  అడ్డుకుంటున్నారు.  మున్సిపల్, ఎమ్మార్వో, ఇతర ప్రభుత్వ  కార్యాలయాల్లో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులు ముఠాగా ఏర్పడి దందాలు చేస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ జగనన్న ఇంటి పట్టాల పేరుతో అవినీతికి పాల్పడ్డారు.  చిన్న తరహా రైతులనుంచి ప్రభుత్వ భూములను ఐదారు లక్షలకు చౌకగా కొనుగోలు చేసి.. ఆ భూములను ప్రభుత్వానికి రూ. 60 లక్షలకు అమ్మి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. ఇవే కాకుండా  ఇరిగేషన్ రిపేర్ల కోసం గ్రామాల్లో రైతుల నుంచి ఇతని ముఠా, అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇరిగేషన్ పూర్తి కావడానికి సహకరించకుండా అవినీతికి పాల్పడుతున్నారు.  అనేక అక్రమాలకు పాల్పడుతున్న యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ని శాప్ ఛైర్మన్ గా చేశారు. తాలిబన్ల చేతిలో క్రీడా రంగాన్ని పెట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్ శాప్ ని ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది.  ఓ యువనేత  ఆకృత్యాలకు శాప్ అడ్డాగా మారిందని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి చెందిన ముఠా నాయకుల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. క్రీడాకారుల అభివృద్ధికి పాటుపడాల్సిన శాప్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. సీఎం కంటే తనకే ఎక్కువ క్రేజ్ ఉందనే భ్రమలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ ధైర్యంతో ఫ్యాక్షన్ తరహా కుట్రలకు తెగబడుతున్నారు. శాప్ నిధుల్ని స్వాహా చేస్తున్నారు. మాటల గారడీ తప్ప నాయకత్వ లక్షణాలు లేని యూట్యూబ్ స్టార్ తన  అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఒక సైకో, ఒక ఉన్మాది  క్రీడలకు అండగా నిలవాల్సిన ఛైర్మన్ పదవిని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అంటగట్టడంతో అతనికి అనుకూలంగా పనిచేయని అధికారులపై దాడులు చేస్తున్నారు.   శాప్ నిధులన్నీ వారి జేబుల్లోకి వెళ్తున్నాయి. ఒక క్రీడాకారిణిపై క్రిమినల్ కేసు ఉండగా.. ఈ విషయాన్ని దాచి ప్రభుత్వానికి తప్పు దోవ పట్టించారు. ఆ క్రీడాకారిణి నుండి సుమారు రూ. 30 లక్షల  వసూలు చేసి ఆమెకు ఉద్యోగం వేయించిన అవినీతి వీరుడు ఈ యూట్యూబ్ స్టార్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. బీఆర్ స్టేడియంలో క్రీడా పరికరాలు కొనుగోలు లో రూ. 5కోట్ల టెండర్ దక్కించుకున్నారు. నాణ్యత లేని, అరకొర సామాగ్రి సమాగ్రి చేసి రూ. 4 కట్లు స్వాహా చేసిన ఘనత వైరెడ్డి సిద్ధారెడ్డిది. ఈ విషయంలో శాప్ ఉన్నతాధికారి ఒకరు నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేయగా ఆ అధికారిపై దాడులు చేశారు. ప్రభుత్వ పేరు ప్రతిష్టలను కాపాడాల్సిన సిద్ధార్థరెడ్డి తనే అల్లరిమూకలతో, అనుచరులతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు. చిన్న పదవినే వెలగబెట్టలేని ఇతన్ని వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేయడం విడ్డూరం. ఇతను ఈ పదవికి ఏమాత్రం పనికిరాడని వైసీపీలోని వ్యక్తులే వ్యక్తం చేస్తున్నారు. శాప్ బోర్డు సభ్యులు సైతం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓబుల్ రెడ్డి అనే ఓ సభ్యుడు క్రీడా కోటా కింద దొంగ సర్టిఫికెట్ ఇవ్వాలని ఏకంగా ఎండీనే అడిగిన ఘనుడు. ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకొనే మరో సభ్యుడు తనకు 5 ఉద్యోగాలు ఇవ్వాలని, వాటిని అమ్ముకుంటానని బేరం పెట్టాడు. ఇంకో సభ్యుడు ఒక అడుగు ముందుకేసి ప్రతి నెల మేము రెండు మూడు లక్షలు బిల్లులు ఇస్తాం ఆ డబ్బు నేరుగా మా ఖాతాల్లో వేయండి  అని డిమాండ్ చేశాడు. క్రీడలతో సంబంధం లేని, క్రీడలపై అవగాహన లేని వారిని సభ్యులుగా  పెట్టుకొని భ్రమల రెడ్డి తన అక్రమాల్ని, కుట్రల్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటలు సాగవని డేనియల్  అనే సభ్యుడిని రెచ్చగొట్టి మీడియా ముందు సమావేశం పెట్టి శాప్ ఎండీపై తప్పుడు ఆరోపణలు చేయించారు. పక్కా ప్రణాళికతో తన స్వా్ర్థం కోసం శాప్ ని అల్లరిపాలు చేశాడు. 82వ శాప్ బోర్డులో 45 ప్రతిపాదనలు చేయగా అన్ని మంజూరు చేయించుకొని ఆ డబ్బు స్వాహా చేసేందుకు పన్నాగం పన్నారు. 1 వ తేది నుంచి 5 వతేది వరకు తిరుపతిలో జరిగిన క్రీడాపోటీల్లో కూడా అవినీతికి పాల్పడ్డారు. స్థానిక పత్రికల్లో కూడా ఈ విషయం బహిర్గతమైంది.  దళిత ఎమ్మెల్యేని అప్రతిష్టపాలు చేస్తున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది హంతక చరిత్ర. స్థానిక దళిత ఎమ్మెల్యేని అగౌరవపరుస్తూ అధికారుల వద్ద హేళన చేస్తున్నాడు. ఎమ్మెల్యే కన్నా తనే ఎక్కువ.. సీఎం అంత క్రేజ్ తనకే ఉందని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో కర్నాటక మద్యం ఏరులై పారుతున్నా చర్యలు లేవని  టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు  తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author