గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించండి
1 min readటెలికాం/టెలిఫోన్ అడ్వైజరి కమిటీ మెంబెర్: కాకర్ల శాంతికుమార్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు లోని BSNL ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు గౌరవ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మరియు TAC చైర్మన్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారి అధ్యక్షతన టెలిఫోన్ అడ్వయిజరి కమిటీ మీటింగ్ ( TAC ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ( TAC ) కాకర్ల శాంతికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని అదేవిధంగా ప్రజలు కూడా ప్రభుత్వ సంస్థను కాపాడాలని మరి ముఖ్యంగా ప్రస్తుతం విద్యార్థులు ఆన్లైన్లో చదువుతున్నారు, అంతర్గత ప్రాంతాలు మరియు గ్రామాల విద్యార్థులు ఇంటర్నెట్ కనెక్టివిటీతో సమస్యలను ఎదుర్కొంటున్నారు తక్షణం సమస్యలు పరిష్కారం చేయాలి అని తెలిపారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ నేతృత్వంలో ఆరు రిమోట్ విలేజ్లో కొత్త BSNL నెట్వర్క్ టవర్లు మంజూరు కావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు.