గిరిజనాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: గిరిజన అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మహానందిలో పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో కొంతమంది చెంచు కుటుంబాలకు లాటరీ పద్ధతిలో ఆవులు మరియు కోడె దూడలను మహానంది దేవస్థానం తరుపున పంపిణీ చేశారు. దీంతోపాటు పంపిణీ చేసిన చెంచులకు ఒక్కొక్కరికి సొంత ఖర్చుతో 500 రూపాయలు చొప్పున దాదాపు 17వేల రూపాయలు నగదును అందజేశారు ఆవులు మరియు కోడెదూడలను పెంచుకొని తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని వాటిని విక్రయిస్తే చట్టరీత్యా నేరం అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చెంచుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు మహానంది దేవస్థానం అధికారులతో పాటు ఐ టి డి ఐ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి వైసీపీ మండల సమన్వయకర్త భువనేశ్వర్ రెడ్డి ఎంపీపీ యశస్విని తాలూకా సి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు .