PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చుక్కల భూముల రైతులకు శాశ్వత పరిష్కారం

1 min read

–ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

పల్లెవెలుగు  వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: చుక్కల భూముల విషయంలో రైతులకు శాశ్వత పరిష్కారాన్ని వైఎస్ జగన్  ప్రభుత్వం చూపించిందని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఎం జగన్ నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన సమావేశంలో చుక్కల భూముల దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడారన్నారు.గత నెలలో అసెంబ్లీలో కూడా చుక్కల భూముల విషయంపై చట్టం చేయడం జరిగిందని, కావలిలో జరిగిన సమావేశంలో సీఎం జగన్ జిఓ  విడుదల చేయడం నిజంగా ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. దీనివలన చుక్కల భూముల రైతులకు ఎంతో మేలు జరిగినట్లు అవుతుందని, నేరుగా  వారు హక్కులు పొందేందుకు అవకాశం కలిగిందని తెలియజేశారు. చుక్కల భూముల రైతులు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, లంచాలు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా లలో క్రయవిక్రయాలు చేసుకొనే హక్కుఈ ప్రభుత్వం కల్పించిందన్నారు   ఈ చట్టం వలన చుక్కల భూముల రైతులకు పూర్తి హక్కులను పొందుతారన్నారు. ఎక్కడా దళారుల మాటలు నమ్మి ఏ ఒక్క రైతు నష్టపోకూడదని విన్నవిస్తున్నామని ఆయన తెలియజేశారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కలను సీఎం జగన్ సాకారం చేశారని, పూర్తిగా చట్టబద్ధతంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జగన్ ఆలోచనలతోనే సాధ్యపడిందన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు రాయచోటి మునిసిపాలిటీకి కూడా ఈ హక్కుకు ఎంపికకాబడిందని ఆయన తెలిపారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఉండే షెటిల్ కాని భూములు కూడా రీసర్వే వల్ల పరిష్కారం కాబోతున్నాయని, దీనివలన రైతులకు ఎంతో మంచి జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో వారికి తెలియకుండా కొంత మంది దొంగ ఆన్ లైన్  చేసుకున్నారని, వారి భూములు వారి అనుభవంలో ఉన్నా జరిగిందని, నేడు అవన్నీ కూడా గుర్తించి అప్పుడు చేసిన పొరపాట్లు కూడా ఈ ప్రభుత్వం సవరించి చేస్తుందంటే ఎంతో గొప్ప విషయమన్నారు. అలాగే ఇనాం భూములు కూడా తహసీల్దార్ స్థాయిలో నుంచి వాటి పరిష్కారానికి కూడా అదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ చుక్కల భూములలో డీకేటీ కానీ ప్రభుత్వ భూమి కానీ లేకుండా ఉంటే పూర్తి హక్కు దారులవుతారన్నారు. అలాగే ఇనాం భూములలో కూడా దేవుడి మాన్యాలు కానీ, దర్గా మాన్యాలు,వక్ఫ్ బోర్డ్ భూములు వంటివి మినహాయించి ఇనాం భూములకు కూడా పరిష్కారం లభించినట్లు అయిందన్నారు. త్వరలో సీఎం జగన్ డీకేటీ భూముల విషయంలో కూడా రెగ్యులరైజ్ చేసే దానిపై ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు. అది కూడా జరిగితే నిజమైన రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. చుక్కల భూములు పరిష్కరించిన జగన్ అప్పగిస్తామనిప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి   తెలిపారు. త్వరలో రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి అన్ని అప్పగిస్తామని చేస్తామని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. రాయచోటి నియోజక వర్గంలో చుక్కల భూములకు సంపూర్ణ హక్కు పొందిన రైతు కుటుంబాల వివరాలును శ్రీకాంత్ రెడ్డి మండలాల వారీగా తెలియచేశారు. గాలివీడు:* చుక్కల భూముల జాబితాలో నుంచి మొత్తం తొలగించిన  సర్వే నెంబర్లు: 19 , తొలగించిన మొత్తం విస్తీర్ణం: 60.86 ,లబ్ది పొందుతున్న రైతన్నల కుటుంబాలు :19లక్కిరెడ్డిపల్లె: చుక్కల భూముల జాబితాలో నుంచి మొత్తం తొలగించిన  సర్వే నెంబర్లు:263 , తొలగించిన మొత్తం విస్తీర్ణం: 348.98,లబ్ది పొందుతున్న రైతన్నల కుటుంబాలు:57 చిన్నమండెం: చుక్కల భూముల జాబితాలో నుంచి మొత్తం తొలగించిన  సర్వే నెంబర్లు:557 , తొలగించిన మొత్తం విస్తీర్ణం: 720.9,లబ్ది పొందుతున్న రైతన్నల కుటుంబాలు:280,రామాపురం: చుక్కల భూముల జాబితాలో నుంచి మొత్తం తొలగించిన  సర్వే నెంబర్లు:10, తొలగించిన మొత్తం విస్తీర్ణం:18.83,  లబ్ది పొందుతున్న రైతన్నల కుటుంబాలు:6,రాయచోటి రూరల్ అండ్ అర్బన్: చుక్కల భూముల జాబితాలో నుంచి మొత్తం తొలగించిన  సర్వే నెంబర్లు:191, తొలగించిన మొత్తం విస్తీర్ణం:545.56,లబ్ది పొందుతున్న రైతన్నల కుటుంబాలు:191,సంబేపల్లె: చుక్కల భూముల జాబితాలో నుంచి మొత్తం తొలగించిన  సర్వే నెంబర్లు: 36 , తొలగించిన మొత్తం విస్తీర్ణం: 123.36,లబ్ది పొందుతున్న రైతన్నల కుటుంబాలు: 43.

About Author