అదికారుల నిర్లక్ష్యం తో అగమైతున్న రైతులు
1 min readరెండు వర్గాలుగా మహిళా సంఘాల గ్రూపులు తలలు పట్టుకున్న అధికారులు
మహిళా సమాఖ్య కొనుగోలు కేంద్రంలో గందరగోళం
వెంకటాపూర్లో తూకాలు చెలిమిల్లలో అమ్మకాలు
లెక్కలు చెప్పాలంటున్న 33 సంఘాలు
రైతులు అడిగితే ధాన్యాన్ని నదిలో పోయమంటున్న -సీసీ
జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
పల్లెవెలుగు వెబ్ శ్రీరంగాపూర్: మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలోని వరి కొనుగోలు కేంద్రంలో గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన మహిళా సంఘం సభ్యులు ఐదు మంది ఆదాయ, వ్యయం చెప్పడం లేదని మిగతా 33 సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వెలుగు సిసి, ఏపీఎం, డిపిఎం లాంటి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నూతన కొనుగోలు కమిటీ ఏర్పాటు చేయడం గానీ,ప్రభుత్వ నిబంధన ప్రకారం వెంకటాపూర్ ఐకెపి సెంటర్ నుండి దాన్య కొనుగోలు పత్రం కానీ ,ట్రక్ షీట్ కానీ చెలిమిళ్ళ సింగిల్ విండో కేంద్రం నుండి అమ్మటం జరుగుతుంది. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసిన మహిళా కమిటీ మధ్యన ప్రస్తుత మిగతా సంఘాల సభ్యుల , బుక్ కీపర్ మధ్య పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ గ్రామంలోని సంఘాలకు ఆదాయ, వ్యయాలు చూపించడం లేదని ఆరోపణలు చేసుకుంటూ వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. ధాన్యం సంచులు ఉన్న గోదాం తలుపులు పగలగొట్టి ఐకెపి వెంకటాపూర్ సంబంధించిన సంచులను ఉపయోగించి చెలిమిల్లా సింగిల్ విండో కేంద్రానికి ధాన్యాన్ని తరలిస్తున్న సంఘటనలు వెంకటాపూర్ ఐకెపి కేంద్రంలో జరుగుతున్నాయి సంఘంలో తమ గ్రామానికి వరి కొనుగోలు ఐకెపి కేంద్రం వద్దని గ్రామం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాద మండల ఐకెపి అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది.సమస్య గత వారం రోజుల నుండి గ్రామంలో మహిళా సంఘాల మధ్య రసభస జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్యను మండలాధికారులు పట్టించుకోవడంలేదని సోమవారం రోజు ప్రజావాణిలోజిల్లా కలెక్టర్ ను కలిసి ఐకెపి కొనుగోలు జరుగుతున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తామని ఇటు రైతులు అటు మహిళా సంఘాల మహిళలు తెలియజేశారు.