PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో హనుమజ్జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  శ్రీశైల క్షేత్రంలో వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకుని రేపు పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం శ్రీశైలం దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది  రేపు ఉదయం 9గంటలకు వేదపండితులు, అర్చక స్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆలే అర్చకులు మహాగణపతిపూజ నిర్వహిస్తారు అనంతరం శ్రీఆంజనేయస్వామివారికి శ్రీమన్యుసూక్త పారాయణ సహిత అభిషేకము, నాగవల్లి దళార్చన, పుష్పార్చన, నీరాజన మంత్రపుష్పములు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.

About Author