కర్ణాటక ఫలితాలు బిజెపికి గుణపాఠం..
1 min read– ఊపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలక ప్రభుత్వాలు- ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం-
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం లాంటివని, పెద్దలకు కొమ్ముకాసి, పేదలకు అన్యాయం చేస్తూ ,మతం ముసుగులో రాజకీయాలు చేసిన బిజెపికి కర్ణాటక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పిస్తూ ఎంతో ఆసరాగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె వి నారాయణ, అధ్యక్షులు వీర శేఖర్ తో కలసి శనివారం మండల కేంద్రమైన దేవనకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బిజెపిదేశంలో ప్రజలకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాాలు తీసుకుందని, అందులో భాగంగా ఉపాధి హాామీ పథకంలో 32 కోట్ల పని దినాలను కల్పిస్తామని చెప్పి , 15 కోట్ల పని దినాలకు తగ్గించడం దారుణం అన్నారు. గతంలో ఉపాధి పనుల వద్ద కూలీలకు మౌలిక వసతులు కల్పించేవారని, ప్రస్తుత పాలక ప్రభుత్వాలు వాటిని విస్మరించడం జరిగిందన్నారు. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రైతుల ఎరువులపై సబ్సిడీ కోత విధించింది అన్నారు. కేంద్ర బడ్జెట్ రూ 46 లక్షల కోట్లు ప్రవేశపెడితే, అందులో పేదలకు కేవలం 10 శాతం, సంపన్న వర్గాలకు 45% కేటాయించడం దారుణం అన్నారు. కూలీలకు కొలతల ప్రకారం వేతనాలు ఇవ్వాలని, రెండు పూటలా హాజరు శాతం ప్రకారం చెల్లిస్తామనడం సబబు కాదన్నారు.