PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫేక్ FACEBOOK అకౌంట్లను.. ఇలా తొల‌గించండి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇటీవ‌ల ఫేస్ బుక్ లో న‌కిలీ అకౌంట్ల బెడ‌ద ఎక్కువైంది. ఒక వ్యక్తి పేరు మీద‌.. ఆ వ్యక్తికి తెలియ‌కుండా.. రెండు, మూడు అకౌంట్లు తెరుస్తున్నారు. ఆ వ్యక్తి ఫ్రెండ్స్ కు రిక్వెస్టులు పంపి.. అర్జెంటుగా డ‌బ్బులు అవ‌స‌రం ఉందంటూ మెసేజ్ లు చేస్తున్నారు. కొంద‌రైతే అడిగిన వెంట‌నే.. ఏ అవ‌స‌రం ఉందో అని .. డ‌బ్బులు ఫోన్ పే, గూగుల్ పే చేస్తున్నారు. తీరా అంద‌తా ఫేక్ అని తెలిసాక‌.. పోలీసుల‌ను ఆశ్రయిస్తున్నారు. త‌మ పేరు మీద న‌కిలీ అకౌంట్ ఉంద‌ని ఎవ‌రైన గుర్తించిన వెంట‌నే.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా.. డైరెక్టుగా ఫేస్ బుక్ సంస్థకే ఫిర్యాదు చేయొచ్చని తెలంగాణ సైబ‌ర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
అది ఎలాగంటే…

  • మీ నకిలీ ఫేస్ బుక్ ఖాతాకు కుడి వైపు ఉన్న మూడు చుక్కల మెనూను ఓపెన్ చేయాలి.
  • అందులో రిపోర్ట్ అనే సెక్షన్ లో ఫేక్ అకౌంట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • ఆ త‌ర్వాత యాప్\వెబ్ సైట్ సూచ‌న‌ల ప్రకారం రిపోర్ట్ ప్రక్రియ పూర్తీ చేయాలి.
  • ఇలా ఓ 20 మంది స్నేహితుల చేత రిపోర్ట్ చేయించాలి.
  • అప్పడు ఫేస్ బుక్ సంస్థే ఆ అకౌంట్ న‌కిలీద‌ని గుర్తించి తొల‌గిస్తుంద‌ని తెలంగాణ సైబ‌ర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.

About Author