పొగ తాగేవారికి కరోనాతో రిస్క్: డబ్ల్యూహెచ్ఓ
1 min readపల్లెవెలుగు వెబ్: పొగతాగేవారికి ఇతర ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనతో మరణించే అవకాశాలు 50 శాతం దాక ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. స్మోకింగ్ వదిలేయాలని, దీంతో కరోనతో వచ్చే రిస్క్ తగ్గతుందని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయసన్ పేర్కొన్నారు. క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల సమస్య కూడ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ చేపట్టిన క్విట్ టొబాకో కార్యక్రమంలో టెడ్రోస్ గెబ్రెయెసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన ప్రచారానికి మంచి స్పందని వచ్చిందని, మిగిలిన దేశాలకు కూడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.