NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా హనుమజ్జయంతి పూజా కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో ఘనంగా హనుమజ్జయంతి పురస్కరించుకుని ఆంజనేయస్వామి విశేషపూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగమార్గంలో శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు లోక కల్యాణం కోసం జరిపిన ఈ విశేషపూజలలో భాగంగా మహాగణపతిపూజ నిర్వహించారు ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర పూజ, నాగవల్లిదళపూజ (ఆకుపూజ), వడమాల సమర్పణ, పుష్పార్చన జరిపించబడ్డాయి. ఆలయ అర్చకులు నిర్వహించారుఈ కార్యక్రమములో ఈఓఎస్. లవన్న ఏఈఓ హరిదాసు, అర్చకస్వాములు తదితరులు పాల్గొన్నారు.

About Author