ప్రమాదానికి గురైన బోటు టూరిజం శాఖధి కాదు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: అవుకు జలాశయంలో ప్రమాదానికి గురైన బోటు ఏపీ టూరిజం శాఖధి కాదని పర్యాటక అధికారి సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుకు జలాశయంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి 12 మంది గల్లంతయ్యారని… సంబంధిత బోటు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారని… టూరిజం శాఖ వారిది కాదన్నారు. జలాశయంలో బోటు నడిపేందుకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చామన్నారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న బోటు రెన్యువల్సుకు సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదని ఆయన స్పష్టం చేశారు. రెన్యువల్ కాకపోయినా బోటు నడిపి ప్రమాదానికి గురైందన్నారు. కాకినాడకు చెందిన ఏపీ మరైన్బోర్డు అధికారులు బోటుని తనిఖీ చేసారని… అనుమతిస్తూ లైసెన్స్ రెన్యువల్సు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్రతి సంవత్సరం బోటు రెన్యువల్ కు సంబంధించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. అవుకు జలాశయంలో ప్రమాదానికి గురైన బోటు ఏపీ టూరిజం కాదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.