పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం
1 min read– వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
– నందికొట్కూరు లో రూ. 4 కోట్ల నిధులుతో నిర్మాణాలు పూర్తయిన 30 పడకల ఆసుపత్రి భవనాలును ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులును సీఎం జగన్ తీసుకువచ్చారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్థర్ అన్నారు.నందికొట్కూరు లో రూ. 4 కోట్ల నిధులుతో నిర్మాణాలు పూర్తయిన 30 పడకల ఆసుపత్రి భవనాలును సోమవారం ఎమ్మెల్యే అర్థర్, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ , చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్య,వైద్య రంగాలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.పేదవానికి ఉచిత కార్పోరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ మరింత పటిష్టం చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.కళ్ళ ముందర అభివృద్ధి పనులు సాకారం అవుచుండడం సంతోషంగా ఉందన్నారు. వైద్య రంగంలోరాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోందన్నారు. కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలును నిర్మించడం జరుగుతోందన్నారు. రాయలసీమలోనే తొలిగా 30 పడకల ఆసుపత్రి నిర్మాణాలును పూర్తిచేసుకుని ప్రారబించుకోవడం హర్షదాయకమన్నారు.నాడు- నేడు తో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయన్నారు.త్వరలో నందికొట్కూరు పట్టణంలో వంద పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ముప్పై పడకల ఆసుపత్రి భవన నిర్మాణాల ప్రారంబోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ,చైర్మన్ లకు నందికొట్కూరు పట్టణ వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్యులు ఘన స్వాగతాలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థల దాతలు బద్రిసెట్టి.రంగయ్య, బద్రిసెట్టి విజయ కుమార్ కుటుంబ సభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అర్శపోగు ప్రశాంతి ,డిసిహెచ్ డా” జఫ్రుల్లా ,డీఈ రాజగోపాల్ రెడ్డి , తహశీల్దార్ రాజశేఖర్ బాబు , ఎంపీడీవో శోభారాణి, మున్సిపల్ కమిషనర్ పి.కిషోర్, ఆసుపత్రి సూపర్ డెంట్ డా.రాయుడు , కౌన్సిలర్ లాల్ ప్రసాద్, నందికొట్కూరు మండల వైసీపీ నాయకులు కౌన్సిలర్లు ఉండవల్లి ధర్మారెడ్డి , జాకీర్ హుస్సేన్ , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , తమ్మడపల్లె విక్టర్ , విశ్రాంత పోలీస్ అధికారి పెరుమాల్ల జాన్ ,ఆర్ట్ శీను , పగిడ్యాల మండల కన్వీనర్ చిట్టిరెడ్డి , పాములపాడు మండల కన్వీనర్ ముడియాల వెంకట రమణా రెడ్డి , కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్, కౌన్సిలర్ లు హమీద్ మియ్య, చాంద్ భాష, కాటెపోగు చిన్నరాజు, షేక్ అబ్దుల్ రవూఫ్, షేక్ నాయబ్, ఉమ్మడి జిల్లాల మైనారిటీ సెల్ జోనల్ ఇంఛార్జ్ అబూబక్కర్, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్ జబ్బార్, వైసిపి నాయకులు ఉస్మాన్ బేగ్, బొల్లెద్దుల రామక్రిష్ణ, మార్కెట్ రాజు, కురువ శ్రీను, వి.ఆర్ శ్రీను, డి.రమేష్, ఎమ్మార్పీఎస్ కె.వి రమణ, గోవింద రెడ్డి పట్టణ గ్రామీణ ప్రాంతాల వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.