హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఇది స్వర్ణయుగం
1 min read– శరవేగంగా విస్తరిస్తున్న నగరం.. దేశంలో అన్నిప్రాంతాల వారికి అనుకూలం
– బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్
– తాన్యాస్ ఇన్ ఫ్రా నూతన కార్పొరేట్ కార్యాలయం ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇది స్వర్ణయుగమని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. ఐటీ సంస్థలు, ఇతర పలు రకాల సంస్థల విస్తరణ కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడికొచ్చి స్థిరపడుతున్నారని ఆయన తెలిపారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా అందరికీ అనుకూలంగా ఉంటాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడే తమ సొంత ఇళ్లు కట్టుకుని శాశ్వత నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చేందుకు తాన్యాస్ ఇన్‌ఫ్రా ముందడుగు వేయడం సంతోషకరమని బండి రమేష్ అన్నారు. హైటెక్ సిటీలోని హుడా టెక్ ఎన్‌క్లేవ్‌లో గల గౌర ఫౌంటెన్ హెడ్ వద్ద తాన్యాస్ ఇన్‌ఫ్రా నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. సొంత ఇల్లు కావాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుందని, దాన్ని సాకారం చేసేందుకు ఇలాంటి సంస్థలు రావడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. విజన్ ఫర్ యువర్ లైఫ్ అనే నినాదంతో ఏర్పాటైన తాన్యాస్ ఇన్‌ఫ్రా నగర వాసుల కలలను నెరవేర్చే దిశగా ముందడుగు వేయాలని బండి రమేష్ సూచించారు. విల్లా ప్లాట్లు, ఫార్మ్ ల్యాండ్లు, ఇతర అన్ని రకాల స్థలాలతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా వీరి ప్రణాళికలున్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా తాన్యాస్ ఇన్‌ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ టి.వంశీవర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు వాకా సుపేంద్రరెడ్డి, తనుబుద్ది జ్యోత్స్న మాట్లాడుతూ, అత్యున్నత నాణ్యత కలిగిన ప్రాపర్టీలను అందించడం ద్వారా వివిధ రకాల అవసరాలున్న క్లయింట్లందరికీ న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. సొంత ఇల్లు కలిగి ఉండాలనే కలను వాస్తవరూపంలోకి తీసుకొచ్చేందుకే తాము అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఈ రంగంలో పదేళ్లకు పైగా ఉన్న అనుభవాన్ని రంగరించి కస్టమర్లకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని తెలిపారు.