బాల్య వివాహాలను ఆపండి
1 min read– గర్భిణీ స్త్రీలు, కౌమార దశ లో ఉన్న బాలికలకు రక్త హీనత లేకుండా చూడాలి
– పిల్లలు బడి మానేయకుండా చూడాలి
– సోషియల్, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ సెల్ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : బాల్య వివాహాల అంశంలో ప్రముఖంగా కర్నూలు జిల్లా పేరు విన్పడుతూ ఉంటుందని, ఈ పేరును తొలగించేలా జిల్లాలో బాల్య వివాహాలను ఆపాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని వి.సి.హాల్ లో సోషియల్, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ సెల్ సభ్యుల సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత, వలసలు, మూఢ నమ్మకాలు, ఆడపిల్లల భద్రత తదితర కారణాల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు..బాల్య వివాహాల నివారణకు రాష్ట్రం లోని ఉన్న మహిళా కలెక్టర్ లు, మహిళా ఎస్పీ లతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం అని, బాలికలకు 18 ఏళ్ల లోపు , బాలురకు 21 ఏళ్ల లోపు వివాహాలు జరక్కూడదన్నారు. ప్రధానంగా ఆడపిల్లలకు చిన్నవయసు లో వివాహాలు చేయడం వల్ల మాతృ మరణాలు సంభవిస్తున్నాయన్నారు.. ఆడ పిల్లల భవిష్యత్తు బాగుండేలా సమాజంలో మార్పు కు అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ సూచించారు. మనకెందుకులే అనుకోకుండా బాల్య వివాహాల సమాచారాన్ని పై అధికారులకు తెలియ చేయాలన్నారు…1902 నంబర్ కు కూడా కాల్ చేయవచ్చన్నారు.. వయసుకు ముందే పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలను వాలంటీర్ లు, anm లు గ్రామాల్లో ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు..గ్రామ,మండల సమాఖ్య ల్లో ఈ అంశంపై మాట్లాడి మహిళలను motivate చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు, కౌమార దశ లో ఉన్న బాలికల్లో రక్త హీనత నివారణకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందించడం జరుగుతోందని, వాటిని వేసుకునేలా అంగన్వాడీ సిబ్బంది, anm లు దృష్ట పెట్టాలన్నారు..బడి ఈడు పిల్లలు బడి లో ఉండేలా, బడి మానేయకుండా సంబంధిత శాఖల అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.సమావేశం లో జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య, డి ఎల్ డి ఓ బాల కృష్ణా రెడ్డి, సెల్ సభ్యులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.