రజక అభ్యుదయ సంఘం సేవలు అభినందనీయం
1 min read– శాసన సభ్యులు గద్దె రామమోహన్
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన రజక సోదరులకు, టైలర్స్ సోదరులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న రజక అభ్యుదయ సంఘం సేవలు అభినందనీయమని శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం కృష్ణలంక 21వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రజక కుటుంబాలకు మరియు టైలర్స్ సోదరులకు సుమారు రు.500 విలువ చేసే 400 నిత్యావసర వస్తువుల కిట్లను శాసనసభ్యులు గద్దె రామమోహన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న వారికి రజక అభ్యుదయ సంఘం, టైలర్స్ సంఘ సభ్యులు ఉమ్మడిగా తమ సంఘం వారిని ఆదుకోవడం కోసం బియ్యం, కూరగాయలు, నూనెలతో కూడిన 10 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీమన్నారు. రజక అభ్యుదయ సంఘం, టైలర్స్ సంఘం అధ్యక్షులు పల్లూరు మధు మాట్లాడుతూ తమ సంఘంలోని ఎంతో మంది ఇనేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో గత 4 సంవత్సరాల నుంచి సంఘ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుకుంటూ వాటిని సంఘంలోని సభ్యుల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండారపు వెంకటేశ్వరరావు, వేములపల్లి రంగారావు, గొరిపర్తి నామేశ్వరరావు, భావన్నారయణ, గణేష్, పెరుమాళ్ళ గురునాధం, కల్పన, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.