ఉద్యోగుల న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
1 min read– ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. APJAC అమరావతి డిమాండ్.
పల్లెవులుగు వెబ్ కర్నూలు: AP JAC అమరావతి మూడోదశ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా 12-05- 2023 నుండి 15-05-2023 వరకు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక, ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారంకొరకు స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు తమ యొక్క సమస్యలను విన్నవించడానికి AP JAC రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తమ న్యాయమైన సమస్యల కోసం నేడు కర్నూలు జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ వి.గిరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్య సంఘాల నాయకులతో కలిసి పాణ్యం శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, కర్నూలు శాసనసభ్యులు శ్రీ ఎం.ఏ హఫీజ్ ఖాన్ గారికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వారికి ప్రాతినిధ్యం చేసి చర్చించడమైనది. వారు స్పందిస్తూ ప్రభుత్వము ఉద్యోగులకు పక్షపాత ప్రభుత్వమని ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కొంత ఇబ్బందుల పడుతున్న మాట వాస్తవమేనని తప్పనిసరిగా మీ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని గౌరవ శాసనసభ్యులు AP JAC అమరావతి ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AP MTF రాష్ట్ర అధ్యక్షులు శ్రీ టి. వెంకటరెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. సురేష్ కుమార్ గారు, కోపరేటివ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగ రమణయ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ శ్రీ రవీంద్ర రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు బి రామానాయుడు ఎస్.లోకేశ్వరి, శోభ సువర్ణమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ వి. గిరి కుమార్ రెడ్డి – చైర్మన్ శ్రీ కె వై కృష్ణ – ప్రధాన కార్యదర్శి, APJAC అమరావతి, కర్నూలు జిల్లా.