నంద్యాల జిల్లా కురువ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లాలోని ప్రతిభావంతులైన కురువ విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు , ఉపాధ్యక్షులు కత్తి శంకర్ గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామిలు పేర్కొన్నారు .మంగళవారం నంద్యాల నగరంలోని కురువ వీథీలో సమావేశం జరిగింది .సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ 2022-23 విద్యాసంవత్సరంలో నంద్యాల జిల్లాలో పదవ తరగతి ,ఇంటర్ రెండవ సంవత్సరములో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకుబహుమతులు ఇస్తామన్నారు. సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన అర్హులైన ప్రతిభావంతులు ఈ నెల 25 వ తేదీలోగా 9032741194,9440756199 ,9849461657, నెంబర్ లకు Watsup ద్వారా మార్కుల జాబితా నకలు మరియు కులసర్టిఫికెట్ నకలును పంపాలని సూచించారు .ఈ సమావేశంలో నంద్యాల జిల్లా నాయకులు,జగదీష్, అల్లబాబు, శిరివెల్ల లింగమయ్య, కోటపాడు కిషోర్, శ్రీనివాసులు, గోస్పాడు మండల అధ్యక్షుడు నాగరాజు ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు .