PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు పినాక ఉచిత శిక్షణా తరగతులు వినియోగించుకోండి

1 min read

– రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని స్థానిక రెవెన్యూ కాలనీ రవీంద్ర హైస్కూల్ లో పీనాక శిక్షణ తరగతులు ఐఆర్ఎస్ అధికారి బి యాదగిరి,అమీలియో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా కోర్సు డైరెక్టర్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్ట్ దగ్గర గల రెవెన్యూ కాలనీలో సాయిసుబ్బయ్య రవీంద్ర హైస్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్,కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్,గ్రూప్స్, సివిల్స్ గైడెన్స్ కోర్సులు ఐఆర్ఎస్(అడిషనల్ కమిషనర్, ఇన్కమ్ టాక్స్,హైదరాబాద్) అధికారి యాదగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లక్ష్మీప్రసాద్ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారని విద్యార్థినిలకు హాస్టల్ వసతి తో పాటు కోర్సు కు సంబంధించిన  విలువైన మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తున్నారని  అడ్మిషన్ల గడువు ఈనెల 18న ముగియనుందని వివరాలకు 9177764147,6301095744 నెంబర్లను సంప్రదించి పినాక వేసవి శిక్షణ తరగతులను కర్నూలు జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలలో గత పదిసంవత్సరాల కిందట యాదగిరి ఐఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పీనాక సొసైటీ ఆధ్వర్యంలో 10కేంద్రాలలో ప్రతి కేంద్రంలో వందమంది విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులను అందిస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయం అని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని యువత ఉజ్వల భవిష్యత్తుకు  బాటలు వేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్.

About Author