PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పసుపు మయం… రాజధాని కళ్యాణ మండపం

1 min read

‘టీడీపీ మినీ మహానాడు’ గ్రాండ్  సక్సెస్

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:అన్నమయ్య జిల్లా కేంద్రం   రాయచోటి పట్టణం రింగ్ రోడ్ లో గల రాజధాని కళ్యాణమండపంలో  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నటరత్న పద్మశ్రీ డాక్టర్ శ్రీనందమూరి తారకరామారావు గారి 100వ జయంతిని పురస్కరించుకొని  మంగళవారం  అతిరధమహారదులతో   ఏర్పాటుచేసిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది.  మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత నందమూరి తారక రామారావు  శతజయంతి ఉత్సవాలుమన రాయచోటిలో జరుపుకోవడం మన అదృష్టం అన్నారు.సినిమాలలో నటిస్తూ రాజకీయాలలోకి వచ్చిరాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినమహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. అనంతరం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలచిననయుగపురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు.సినిమాలలో రాముడు కృష్ణుడు తదితర పాత్రల్లో నటించిననందమూరి తారక రామారావును తెలుగు ప్రజలు అచ్చం దేవుడు లాగానేతమ మనసుల్లో నిలుపుకొన్నారన్నారు. ఆ తరువాత సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.అదేవిధంగా 2024 లో జరిగే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరిగి చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేయాల్సిన  బాధ్యత మన అందరిపై ఉందన్నారు.  సుగవాసి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అన్నారు.సినిమాలలో హీరోగా నటిస్తూ రాజకీయ రంగంలో ప్రవేశించి ఆరు నెలల కాలంలోనేముఖ్యమంత్రి అయిన ఘనతనందమూరి తారక రామారావుకే చెందుతుందన్నారు. తెలుగు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించినదైవాంశ సంభూతుడు ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి , రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, తెలుగుదేశం పార్టీ  ఇన్ చార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ,పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author