నీటి తీరువా వసూళ్లుప్రారంభించని రాష్ట్ర రెవెన్యూ శాఖ
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: రాష్ట్రంలో 2022-23 సంవత్సరానికి గాను ( 1432వ ఫసిలీ) నీటి తీరువా వసూళ్లు ఇప్పటివరకు ప్రారంభించని విషయమై రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నివేదిక కోరుతూ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు .కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర లోకాయుక్తకు2023 మార్చి 18 తేదీన చేసిన ఫిర్యాదు పై రాష్ట్ర లోకాయుక్త రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని నివేదిక కోరారు. వ్యవసాయానికి రైతులు వినియోగించుకుంటున్న సాగునీటికి ప్రభుత్వం విధించే నీటి తీరువా 2022 -23 సంవత్సరానికి గాను (1432వ ఫసిలీ)2022 జూలై 1 నుంచి వసూలు ప్రారంభించవలసిన నీటి తీరువా (ఎకరానికి రూ.200/) వసూలు చేయటానికి రాష్ట్ర రెవెన్యూ శాఖఏ.పీ సేవా ఫోర్టల్ లో చెల్లించేందుకు ఆన్ లైన్ లో పొందుపరచడం గాని ,నీటి తీరువా శిస్తు రసీదు పుస్తకాలను వీఆర్వోలకు ఇవ్వటం గాని ,(1432వ ఫసిలీ) ప్రారంభమై 9 నెలలు గడుస్తున్నా చేయ నందున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో నీటితీరువా వసూళ్లకురాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (మంగళగిరి) తగు చర్యలు తీసుకోగలందులకు రాష్ట్ర లోకాయుక్త కుఫిర్యాదు చేయడం జరిగిందని ,సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.