ప్లాస్టిక్ ఉపయోగంతో మానవ మనుగడకు ప్రమాదం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ప్లాస్టిక్ ఉపయోగించడం వలన మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని. మహానంది డిఆర్ఓ సుబ్బయ్య పేర్కొన్నారు. ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ ఆదేశాల మేరకు మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వృధాగా పడవేసిన ప్లాస్టిక్ కవర్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను సేకరించి అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. పర్యావరణం పరిరక్షణ జీవన విధానం అనే దానిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు స్వచ్ఛందంగా పాల్గొని ఆశ్రమ పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ప్లాస్టిక్ తో తయారైన వస్తువులను వినియోగించరాదని అవి భూమిలో కుళ్ళిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని ఇది మానవ మనుగడకు ప్రమాద సూచికని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గార్డు ప్రతాప్ మరియు మరికొంతమంది పాల్గొన్నారు.