PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరు సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలోని  ఆదోని రహదారిలో  ఉన్న  జలవనరుల  శాఖ అతిథిగృహంలో ఆధునికరించీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మిగనూరు పోలీసు సబ్ డివిజన్ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు  ప్రారంభించారు.  అనంతరం ఆఫీసర్ విజిటింగ్ బుక్ లో సంతకం చేసి ,  డిఎస్పీ కార్యాలయం ఆవరణంలో మొక్కను నాటారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశవ రెడ్డి, మంత్రాలయం ఎమ్మేల్యే శ్రీ బాల నాగిరెడ్డి  ఉన్నారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు  మీడియాతో మాట్లాడారు.  ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ఏర్పడిన తర్వాత ఈ రోజు ఎమ్మిగనూరు డిఎస్పీ ఆఫీసు ను ఆవిష్కరణ చేసి ప్రారంభించడం జరిగిందన్నారు.  సహాయ సహాకారాలు అందించిన వారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ జరిగిన తర్వాత  ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ఆఫీసు ను  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సబ్ డివిజన్  పరిధిలో ప్రజలకు  ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే  డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పి స్థాయి అధికారికి విన్నవించుకోవచ్చన్నారు.అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే  9 న  జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చేశారన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చే స్పందన ఫిర్యాదులపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.శాంతిభధ్రతల పరిరక్షణ, ప్రజల సమస్యలను త్వరిగత గతిన  పరిష్కరించే దిశగా ఎస్ఐ స్థాయి అధికారులు  ఎప్పటికప్పుడు ఆ సమస్యల పట్ల  గట్టి చర్యలు  తీసుకుంటున్నారన్నారు.అనంతరం ఎమ్మిగనూరు పట్టణ, గ్రామీణ, ట్రాఫిక్  పోలీసుస్టేషన్ లను మరియు పోలీసు క్వాటర్స్ ను  జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య , సిఐలు  మధుసుధన్ రావు, శ్రీనివాసులు, ఎరిషావలి,  ఎస్సైలు  ఉన్నారు.

About Author